EMRS Recruitment 2025: ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో 7267 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి? పూర్తీ గైడ్..!

By Abdul Gaffar

Published On:

Eklavya Model Residential Schools 2025 recruitment notification banner showing vacancies for teaching and non-teaching posts, with application dates and total post coun

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

EMRS Recruitment 2025: ఆదివాసీ విద్యార్థుల కోసం స్థాపించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు! నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) తరపున సెప్టెంబర్ 19న అధికారిక నోటిఫికేషన్ విడుదల అయ్యింది ఈ భర్తీలో మొత్తం 7267 పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

✨EMRS Recruitment 2025- ముఖ్య విశేషాలు

వివరాలుసమాచారం
పరీక్ష నిర్వహించే సంస్థనేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS)
సంస్థ పేరుఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS)
పరీక్ష పేరుEMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ESSE)- 2025
పోస్టులుప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, హాస్టల్ వార్డెన్ (మగ మరియు ఆడ), ఫిమేల్ స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), మరియు ల్యాబ్ అటెండెంట్
ఖాళీల సంఖ్య7267
దరఖాస్తు విధానంఆన్‌లైన్
రిజిస్ట్రేషన్ తేదీలుసెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 23, 2025 వరకు
పరీక్ష విధానంఆఫ్‌లైన్
ఎంపిక ప్రక్రియటైర్ I (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్)
టైర్ 2 (సబ్జెక్ట్ నాలెజ్ ఎగ్జామినేషన్)
వ్యక్తిగత చర్చ / ఇంటర్వ్యూ (ప్రిన్సిపాల్)
జీతంపోస్టు ప్రకారం
ఉద్యోగ స్థలంభారతదేశం అంతటా
అధికారిక నోటిఫికేషన్PDF డౌన్‌లోడ్
అధికారిక వెబ్‌సైటుhttps://emrs.tribal.gov.in/

💡 EMRS 2025 ముఖ్య అంశాలు

ఈ భర్తీలో ప్రిన్సిపాల్, PGT, TGT, హాస్టల్ వార్డెన్, స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, క్లర్క్, ల్యాబ్ అటెండెంట్ వంటి వివిధ పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది.

📋 ఖాళీల వివరాలు

పోస్ట్ పేరుఖాళీల సంఖ్యఅర్హత
ప్రిన్సిపాల్225మాస్టర్స్ డిగ్రీ + B.Ed + 10 సంవత్సరాల అనుభవం
PGT టీచర్స్1460మాస్టర్స్ డిగ్రీ + B.Ed
TGT టీచర్స్3962గ్రాడ్యుయేషన్ + B.Ed + CTET
స్టాఫ్ నర్స్550B.Sc నర్సింగ్
హాస్టల్ వార్డెన్635గ్రాడ్యుయేషన్
అకౌంటెంట్61B.Com/అకౌంట్స్ డిగ్రీ
క్లర్క్ (JSA)22812వ తరగతి + టైపింగ్
ల్యాబ్ అటెండెంట్14610వ/12వ తరగతి

👉 ఇకపై మీ ఆధార్ కార్డు వాట్సాప్‌లోనే క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకోండి… ఎలా పొందాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.

⏳ వయస్సు పరిమితులు

ప్రిన్సిపాల్ పోస్టుకు గరిష్టం 50 సంవత్సరాలు, PGT మరియు TGT లకు 40 సంవత్సరాలు, నాన్-టీచింగ్ పోస్టులకు 35 సంవత్సరాలు వయస్సు పరిమితిగా నిర్ణయించారు.

📝 EMRS Recruitment 2025 దరఖాస్తు ప్రక్రియ – స్టెప్ బై స్టెప్

  1. అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లండి
    మొదటగా, అధికారిక వెబ్‌సైట్ https://emrs.tribal.gov.in/ లేదా https://nests.tribal.gov.in/ ను ఓపెన్ చేయండి.
  2. EMRS Recruitment 2025 లింక్ క్లిక్ చేయండి
    ఇంటర్ ఫేస్ లో “Apply Online” లేదా “Registration” ఆప్షన్ ఎంచుకోండి.
  3. న్యూయర్ అకౌంట్ క్రియేట్ చేయండి (లేదా లాగిన్ అవ్వండి)
    కొత్త అభ్యర్థులు మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటికే ఉన్నవారు యూజర్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి.
  4. దరఖాస్తు ఫారం పూర్తి చేయండి
    పేరును సరిగ్గా ఎంటర్ చేసి, విద్యార్హతలు, వయస్సు, ఎగ్జామ్స్ వివరాలు, మరియు వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వాలి. తప్పులు లేకుండా జాగ్రత్తగా పూరించండి.
  5. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
    పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం స్కాన్, విద్యార్హత సర్టిఫికేట్లు తదితరాలు వివరణలో ఇస్తున్న ఫార్మాట్ లో అప్‌లోడ్ చేయండి.
  6. దరఖాస్తు రుసుము చెల్లించండి
    జనరల్, OBC, EWS అభ్యర్థులు ₹1500 – ₹2500 మధ్య రుసుము చెల్లించాలి. SC/ST/మహిళలకు ₹500 మాత్రమే. PwBD అభ్యర్థులకు రుసుము విడుది ఉంది.
  7. దరఖాస్తును సమర్పించండి
    అన్నీ జాగ్రత్తగా చూసుకొని “Submit” బటన్ మీద క్లిక్ చేసి దరఖాస్తును పూర్తి చేయండి.
  8. దరఖాస్తు ఫారమ్ ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి
    సబ్‌మిట్ చేసిన దరఖాస్తు ఫారమ్ యొక్క కాపీని భవిష్యత్తులో అవసరం కోసం సేవ్ చేసుకోవడం మంచిది.
  9. ఎగ్జామ్‌కు సంబంధించి అప్డేట్స్ కోసం వెబ్‌సైట్ లేదా ఇమెయిల్/SMS ని చెక్ చేసుకోండి
    ఎగ్జామ్ తేదీలు, హాల్ టికెట్స్ వంటి వివరాలు అధికారికంగా చూసుకోవాలి.

🎯 ఎంపిక ప్రక్రియ

EMRS స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ESSE-2025) ద్వారా ఎంపిక జరుగుతుంది. ప్రిన్సిపాల్ పోస్టుకు మూడు దశలు (ప్రిలిమినరీ, సబ్జెక్ట్ నాలెజ్, ఇంటర్వ్యూ), ఇతర పోస్టులకు రెండు దశలు ఉంటాయి.

🗓️ ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల: సెప్టెంబర్ 19, 2025
  • దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 19, 2025
  • చివరి తేదీ: అక్టోబర్ 23, 2025 (రాత్రి 11:50)
  • హెల్ప్‌లైన్: 011-22240112

👉 Also read: తెలంగాణ మైనారిటీ గురుకులల్లో 3,488 టీచింగ్ & నాన్ టీచింగ్ జాబ్స్… జిల్లాల వారీగా ఖాళీలు, అర్హతలు వివరాలు

👉 Also read: 1వ తరగతి నుండి పీజీ వరకు విధ్యార్ధులకకు స్కాలర్‌షిప్‌ కావలసిన పత్రాలు? ఎలా అప్లై చేయాలి?

Abdul Gaffar

అబ్దుల్ గఫార్ mrjobs247.in వెబ్‌సైట్‌లో కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ప్రభుత్వ పథకాలు, తాజా ఉద్యోగ అప్‌డేట్స్ మరియు ఉద్యోగార్థులకు ఉపయోగపడే సమాచారం గురించి వ్రాస్తారు. లోతైన పరిశోధన చేసి కచ్చితమైన, నమ్మకమైన సమాచారాన్ని మాత్రమే అందించడంలో నిబద్ధత చూపిస్తారు. ఉద్యోగార్థులు మంచి కెరీర్ నిర్ణయాలు తీసుకునేలా మార్గదర్శనం చేయడం మరియు సామాన్య ప్రజలకు ప్రభుత్వ పథకాలు సులభంగా అర్థం అయ్యేలా వ్రాసి, వారు ప్రయోజనం పొందేలా మార్గదర్శనం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

Leave a Comment